Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఆ అధికారం ఉంది
- వేలం వేస్తూ షెడ్యూల్ ఎలా ఇచ్చారు?
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 సెక్షన్ 17 ఏ, 11ఏ ప్రకారం సింగరేణి సంస్థకు ఓపెన్ టెండర్‌తో సంబంధం లేకుండా కోల్‌బ్లాక్స్‌ను రిజర్వ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందనీ, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి అండర్ గ్రౌండ్ అండ్ ఓపెన్ కాస్ట్ కోల్ మైన్స్ ను గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ పరిధిలో కలిగి ఉందని తెలిపారు. గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ పరిధిలోని కళ్యాణ ఖని, కోయలగూడెం, శ్రావణపల్లి, సత్తుపల్లి కోల్ బ్లాక్స్‌ను సింగరేణి సంస్థకు కేటాయించాల్సి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకగానే యాజమాన్య విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదన్నారు. కోయల గూడెం కోల్‌బ్లాక్‌ను ఇప్పటికే వేలం వేసి ప్రయివేటు సంస్థకు అప్పగించారని తెలిపారు. శరవేగంగా బొగ్గు గనుల బ్లాకుల వేలం పాటల ప్రక్రియ కొనసాగుతున్నదనీ, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టెండర్ షెడ్యూల్‌ను ఆయన చూపారు. ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సింగరేణిపై చేసిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.