Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కడివెండి నుంచి కేరళలోని త్రిసూర్ దాకా
- డిసెంబర్ 13-16 వరకు ఏఐకేఎస్ అఖిల భారత మహాసభలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐకేఎస్ అఖిల భారత మహాసభలు ఈనెల 13-16 వరకు కేరళలోని త్రిసూర్‌లో జరగనున్నాయి. మహాసభల నేపథ్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్వగ్రామమైన కడవెండిలో డిసెంబర్ 5న అమరవీరుల జ్యోతి యాత్ర ప్రారంభమై...త్రిసూల్ పట్టణానికి చేరుకుంటుంది. మొదటి యాత్ర వీర తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్వగ్రామమైన కడివెండి నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్, కేంద్ర కమిటీ సభ్యులు టి. సాగర్ నాయకత్వం వహిస్తారు.
రెండవ యాత్ర తమిళనాడులోని కిజ్వ్‌న్‌మణిలో ప్రారంభమవుతుంది. దీనికి ఏఐకేఎస్ సహాయ కార్యదర్శులు డాక్టర్ విజ్జు కృష్ణన్, ఎస్‌కె ప్రీజా నాయకత్వం వహిస్తారు. వ్యవసాయ రంగం, రైతులు, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్న అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పిలుపునిచ్చారు. రైతుల అమరవీరుల జ్యోతి యాత్రలో రైతులు, వివిధ ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు.
యాత్ర షెడ్యూల్ : 10.00 కడవెండి (జనగాం జిల్లా) ,01.00 రామన్నపేట(యాదాద్రి భువనగిరి జిల్లా),02.00 గుండ్రాంపల్లి (నల్లగొండ జిల్లా),03.30 నల్లగొండ, 05.30 మిర్యాలగూడ.