Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బెండలపాడు గ్రామం నుంచి గుత్తికోయలను బహష్కరిస్తూ చేసిన తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు చెప్పింది. ఆ గ్రామం నుంచి వారిని బహిష్కరిస్తూ ఛత్తీస్గడ్కు పంపేయాలన్న తీర్మానాన్ని కొట్టేసింది. గ్రామ పంచాయతీకి అలాంటి అధికారాలుండబోవని జస్టిస్ లలిత జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చండ్రుగొండ మండలం బెండలపాడు పంచాయతీ తీర్మానాన్ని కొట్టేయాలంటూ కె హెడ్మా ఇతరులు వేసిన రిట్లో ఈ ఉత్తర్వులు వెలువరించారు.