Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్‌కు హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో అభియోగాలకు సంబంధించి సిట్ దాఖలు చేసిన కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్, కేరళ డాక్టర్ జగ్గుస్వామిని కూడా అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన 41 ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే విధించాలంటూ జగ్గుస్వామి వేసిన కేసు వేసిన విషయం తెలిసిందే. గత విచారణలోనే సంతోష్‌ను అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులను పొడిగిచింది. ఆ రెండు పిటిషన్లను సోమవారం జస్టిస్ సురేందర్ విచారించారు. 41 ఏ నోటసుపై స్టే ఇవ్వడమే కాకుండా సిట్ ఇచ్చిన లుక్ఔట్ నోటీసు అమలును కూడా నిలిపివేస్తూ స్టే ఆదేశాలు జారీ శారు. 41 ఏ నోటీసుపై సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు. విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నామనీ, అప్పటి వరకు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి, బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్‌కి మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్టు సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చి ఆయనకు 41 ఏ నోటీసు జారీ చేసింది. నోటీసులో ఏ వివరాల్లేవని వారి తరఫు న్యాయవాదులు చెప్పారు. నోటీసులోనే పూర్తి వివరాలు పొందుపర్చాల్సిన అవసరం లేదంటూ సిట్ వాదించింది.