Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి కలెక్టరేట్లో ఘటన
- కొడుకు పేరున ట్రాక్టర్ ఉందని పింఛన్ రద్దు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
కొడుకు పేరున ట్రాక్టర్ ఉందని వికలాంగుని పింఛన్ రద్దు చేయడంతో బాధితుడు కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. భువనగిరి మండలం హన్మాపురం గ్రామానికి చెందిన నాగపురి యాదగిరికి మునుగోడు ఉప ఎన్నికల ముందు ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. అయితే, సెప్టెంబర్ నెల మాత్రమే పింఛన్ ఇచ్చారు. అక్టోబర్ నుంచి ఇవ్వడం లేదు. భువనగిరి ఎంపీడీవో గుత్తా నరేందర్‌రెడ్డిని సంప్రదించాడు. బాధితుని కొడుకు నాగపురి వినోద్ పేరు మీద ట్రాక్టర్ ఉందని, అందుచేత నిబంధనలకు లోబడి పింఛన్ రద్దు అయినట్టు ఎంపీడీవో చెప్పారు. యాదగిరి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టరేట్‌కు వచ్చాడు. కలెక్టర్ సమక్షంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నించాడు. కార్యా లయ సిబ్బంది సహకారంతో పోలీసులు బాధితున్ని అడ్డుకున్నారు. పింఛన్ కోసం ఇప్పటికే పలుమార్లు డీఆర్డీఓ మందడి ఉపేందర్ రెడ్డి, ఎంపీడీఓ నరేందర్ రెడ్డిని కలిసినా ఫలితం లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.