Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. బాధితుని నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్టర్ జమీరుద్దీన్ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన కథనం ప్రకారం.. తాండూర్ పట్టణానికి చెందిన ఇర్షద్ 2019లో యాలాల మండలంకు చెందిన ఈర్యా నాయక్‌కు రూ.ఐదు లక్షల అప్పు ఇచ్చారు. ఇందుకు ఈర్యా నాయక్ ధౌలాపూర్ గ్రామానికి చెందిన భూమిని గ్యారెంటీగా పెట్టి ఈర్షద్కు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. ఇర్షద్‌కు ఈర్యానాయక్ తిరిగి డబ్బులు చెల్లించాడు. రిజిస్ట్రేషన్ చేసిన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రద్దు చేయించుకునేందుకు తాండూరు సబ్ రిజిస్టార్‌ను ఆశ్రయించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంటును రద్దు చేసేందుకు తాండూరు సబ్ రిజిస్టర్ జమ్మిరోద్దీన్ రూ.లక్ష లంచం కావాలని డిమాండ్ చేశాడు. దాంతో ఈర్షద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మధ్యాహ్నం తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ దగ్గర పనిచేస్తున్న జహీరుద్దీన్‌కు డబ్బు అప్పజెప్పాలని తెలిపారు. బాధితుడు అతనికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి విచారణ జరిపి తాండూరు సబ్ రిజిస్టర్ జమిరుద్దీన్ను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు.