Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని ఈ నెల పదోతేదీన హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగే ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, రైతు బంధు నిధుల విడుదల, సొంత జాగాలు ఉన్న బలహీన వర్గాల వారి గృహ నిర్మాణాలు, దళిత బంధు అమలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.