Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాధపాలెం
ఇటీవల మృతిచెందిన రేంజర్ చలమల శ్రీనివాస్‌రావు కుటుంబాన్ని సోమవారం సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. శ్రీనివాసరావు స్వగ్రామమైన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామానికి వెళ్లిన తమ్మినేని.. శ్రీనివాస్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీనివాసరావు మామ అయిన డాక్టర్ ఎం.రామనాథంని కూడా పరామర్శించారు. శ్రీనివాసరావు మృతి వారి కుటుంబ సభ్యులకు తీరని లోటన్నారు. శ్రీనివాసరావు విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన అధికారిగా పేరు పొందారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంచే మెడల్ సంపాదించి ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య వీరభద్రం, రఘునాథపాలెం మండల కార్యదర్శి, ఎస్ నవీన్ రెడ్డి, రైతు సంఘం మండల నాయకులు బానోతు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కాపర్తి రవీందర్, జూలూరుపాడు మండలం పార్టీ కార్యదర్శి వెంకటి తదితరులు పాల్గొన్నారు.