Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 మంది విద్యార్థులకు గాయాలు
- బిజిలీపూర్ శివారు వద్ద ఘటన
నవతెలంగాణ-వట్పల్లి
డ్రైవర్ అతివేగం కారణంగా ఓ స్కూలు బస్సు బోల్తాపడి 16 మంది విద్యార్థులకు గాయాల య్యాయి. ఎలాంటి ప్రాణాపాయం జరగకపో వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బిజిలిపూర్ శివారులో సోమవారం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేట పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూలుకు మండల పరిధిలోని పలు గ్రామాల విద్యార్థులు వెళ్తుంటారు. అయితే సోమవారం ఉదయం కూడా పల్వట్లకు చెందిన 11 మంది, మరువెల్లికి చెందిన 6మందితో స్కూల్ బస్సు బిజిలీపూర్ మీదుగా వెళ్తున్నది. కాగా ఉదయం డ్రైవర్ కాస్త ఆలస్యంగా బస్సు తీయడంతో.. సకాలంలో పిల్లలను పాఠశాలలో చేర్చాలనే ఉద్దేశంతో అతివేగంగా నడిపాడు. ఈ క్రమంలో బిజిలిపూర్ సరిహద్దు వద్ద క్రాస్ రోడ్డు ఉండటంతో బస్సు కంట్రోల్ తప్పి బోల్తా పడింది. దాంతో బస్సులోని విద్యార్థులందరికీ గాయా లయ్యాయి. బలమైన గాయాలు తగిలిన నరసింహులుకు సంగారెడ్డిలోని చరిత హాస్పిటల్లో చికిత్సలో అందిస్తున్నారు.
స్వల్ప గాయాలయిన వారికి ప్రథమ చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాధా బారు, డిప్యూటీ తహసీల్దార్ చంబి రెడ్డ్డి స్థానిక ఎస్ఐ అంబర్యా ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.
స్పందించని విద్యాధికారులు, పాఠశాల యాజమాన్యం
ఇంతటి ఘోరమైన ఘటన జరిగినప్పటికీ అటు విద్యాశాఖ అధికారి గానీ, ఇటు పాఠశాల యాజమాన్యం గానీ కనీసం పట్టించుకోవట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనీసం క్షతగాత్రులను కూడా పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్నెస్ లేని బస్సులను నడపడం వల్లనే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. అనంతరం జోగిపేట పోలీస్ స్టేషన్లో పాఠశాల యజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.