Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే నవంబర్ నెలలో రికార్డు స్థాయి అదాయాన్ని సాధించింది. ఈ ఒక్క నెలలోనే ప్రయాణీకుల రవాణా ద్వారా రూ.435.66 కోట్లు, సరుకు రవాణా ద్వారా రూ.1,083.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇంతటి ఆదాయం గత సంవత్సరాలతో పోల్చితే ఒకే నెలలో ఎన్నడూ రాలేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వివరించారు. ఈ సందర్బంగా ఆయన జోన్ పరిధిలోని రైల్వే ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. జోన్ పరిధిలో 93 ప్రత్యేక రైళ్లను 460 ట్రిప్పులు నడిపామన్నారు. ఈ నెలలో మొత్తం 2.82 లక్షల మంది ప్రయాణీకులకు రైల్వే సేవలు అందించామన్నారు. 625 అదనపు బోగీల ఏర్పాటు ద్వారా 42,757 మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చినట్టు వివరించారు. సరుకు రవాణాలో 10,481 మెట్రిక్ టన్నులు వేర్వేరు ప్రాంతాలకు రవాణా చేసి, రూ.1,083.63 కోట్ల ఆదాయం సాధించినట్టు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలతో పోల్చితే 15 శాతం అదనపు ఆదాయం సమకూరిందన్నారు. ఆపరేషన్స్, కమర్షియల్ సిబ్బంది ఇదే ఒరవడిని కొనసాగిస్తూ, సంస్థ ఆదాయం మరింత పెరిగేలా కృషి చేయాలని కోరారు.