Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎమ్డీ ఫసియొద్దీన్, కె.యాదానాయక్, గౌరవాధ్యక్షులుగా భూపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎమ్డీ. ఫసియొద్దీన్, కె.యాదానాయక్, గౌరవాధ్యక్షులుగా భూపాల్, కోశాధికారిగా ఎ.కవిత ఎన్నికయ్యారు. ఈ మేరకు యాదానాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ యూనియన్ రాష్ట్ర మూడో మహాసభలో 60 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కె. బలరాం, వి. మరియమ్మ, ఎస్. హరిశంకర్, సంజు జార్ట్, వి. విజయవర్ధన్రాజు, కార్యదర్శులుగా జె. సుధాకర్, బి. కిరణ్మయి, జె. కొండలరావు, బి. శ్రీనివాస్, ఎస్. నవీన్‌కుమార్ ఉన్నారు. మరో 45 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని యాదానాయక్ డిమాండ్ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించి పీహెచ్‌సీలు, ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలువులివ్వాలనీ, రెండో పీఆర్సీని వెంటనే ప్రకటించి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.