Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ క్యాంపును నిర్వహించడం అభినందనీయం: ఐఎంఏ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ సుచరిత
- ప్రతి ఏడాదీ ఉచిత ఆర్థోపెడిక్ చికిత్స క్యాంపు : డా|| మల్లు అరుణ్‌కుమార్
నవతెలంగాణ-నల్లగొండ
మల్లు వెంకటనర్సింహారెడ్డి 18వ వర్ధంతి సందర్భంగా ఓ వ్యక్తికి ఉచితంగా మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నీలగిరి ఐఎంఏ సహకారంతో సత్యవతి మల్టీస్పెషాలిటీ హాస్పిట్లో ఆర్థోపెడిక్ వైద్య క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ సుచరిత ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఉచిత ఆరో ్థపెడిక్ మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఇలాంటి క్యాంపు లకు ప్రతి ఒక్కరూ ముందుండి సహకరించాలని కోరారు. ట్రస్ట్ చైర్మెన్ అక్కెనపల్లి మీనయ్య మాట్లాడుతూ.. ఎంవీఎన్ ట్రస్టు ద్వారా ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని విజ్ఞాన కేంద్రంలో లైబ్రరీ, రీడింగ్ కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనాకాలంలో లైబ్రరీని ఆస్పత్రిగా మార్చి కరోనా రోగులకు చికిత్స అందించామని తెలిపారు. ఇంకా.. ట్రస్టు ద్వారా గ్రూప్ వన్, గ్రూప్ టూ, వీఆర్వో అభ్యర్థులకు ఉచితంగా బోధన అందిస్తున్నామని వివరించారు. చిన్నారులకు ఉచిత కరాటే నేర్పిస్తున్నట్టు చెప్పారు. మల్లు వెంకట నరసింహారెడ్డి మనుమడు, మల్లు లక్ష్మి -నాగార్జునరెడ్డి దంపతుల కుమారుడు డాక్టర్ మల్లు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరమూ తాతయ్య వర్ధంతి రోజు ఉచితంగా మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ఉచిత క్యాంపును ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందు లతో బాధపడుతున్న నిరుపేద కుటుం బాలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మేళ్లచెరువుకు చెందిన వెంకట్‌కు పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచి తంగా మోకాలి చిప్ప మార్పిడి చికిత్స నిర్వహించారు. అంతకుముందు ఎంవీఎన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి పుచ్చకాయల నర్సిరెడ్డి, పద్మావతి మల్టీస్పెషాల్టీ ఆస్పత్రి చైర్మెన్ సూరేపల్లి సత్యనారాయణ, డాక్టర్లు సూరేపల్లి రామ్మనోహర్, సంపద, డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.