Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు తీర్పు ఇచ్చినా ఇండ్ల స్థలాలు ఇవ్వట్లే..!
- జర్నలిస్టుల సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జర్నలిస్టు వృత్తి గౌరవ ప్రదమైనా.. సమాజానికి వారు చేస్తున్న సేవలు గొప్పవైనా.. పాత్రికేయులు దుర్భర జీవితం అనుభవిస్తున్నారని, వారిని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. జర్నలిస్టుల సమస్యల సాధన కోసం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్‌లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్ అధ్యక్షతన చేపట్టిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు వృత్తిపరమైన భద్రత లేదన్నారు. 90శాతానికి పైగా జర్నలిస్టులు పేద, దిగువ మధ్యతరగతికి చెందినవారే అయినం దున.. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలను తమ పార్టీ రాష్ట్ర నాయ కత్వం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిందన్నారు. జన వరిలో జర్నలిస్టుల సమస్యలపై మరింత ఉధృతంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. జర్నలిస్టుల సంఖ్య తక్కువే కదా.. వారి సమస్యను పక్కకు పెట్టాలనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తే జనవరి నుంచి మిగిలిన కార్మికుల మాదిరిగానే జర్నలిస్టుల తరపునా సీపీఐ(ఎం) ఉధృతంగా ఉద్యమాలు నిర్వ హిస్తుందన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్సు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్సు (టీయూడబ్ల్యూజే (ఐజేయూ)), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్స్టు (టీజేఎఫ్), తెలంగాణ వీడియో జర్నలిస్స్ట్ అసో సియేషన్ (టీవీజేఏ), తెలంగాణ జర్నలిస్ట్సు అసోసియేషన్ (టీజేఏ)తో పాటు విద్యావంతుల వేదిక మద్దతు ప్రకటించాయి. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వర్లు, బండి రమేష్, బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, భూక్యా శ్రీనివాస్, యర్రా శ్రీనివాస్, వివిధ జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.