Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యారేజ్ వర్క్‌షాప్‌లో వార్షిక తనిఖీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ లాలాగూడలోని క్యారేజ్ వర్క్ షాప్‌లో మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హెరిటేజ్ మ్యూజియంను ఆయన ప్రారంభించారు. ఈ తనిఖీల్లో ఆయనతోపాటు ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ జె.కె.జైన్, క్యారేజ్ వర్క్‌షాప్ మేనేజర్ బీరేంద్ర సింకు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన మహాపరినిర్వాణ్ దివస్‌లో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్‌హెచ్‌బీ బోగీ షాప్, వీల్ షాప్‌లోని సెంటర్ బఫర్ కప్లర్ సెక్షన్‌ను ఆయన తనిఖీ చేశారు. జనరల్ మేనేజర్ పవర్ కార్ షాప్‌లో హారిజంటల్ డ్రిల్లింగ్, ట్యాపింగ్ మెషిన్, ఫియేట్ బోగీ మెయింటెనెన్స్ షాప్, ప్రెషరైజ్డ్ ఫ్లషింగ్ సిస్టమ్, ఈఎంయూ (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) టెస్ట్ బెంచ్‌లను ప్రారంభించారు. అనంతరం కొత్త ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం వివిధ అభివద్ధి పనులకు సంబందించిన ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.