Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- :డాక్టర్ పిడమర్తి రవి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 66వ వర్థంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్లోని ట్యాంకు బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి నిజమైన దేశాభివద్ధి అని భావించి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టారని చెప్పారు. ,కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో కూడా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, రాజ్యాంగ స్ఫూర్తిని, దళిత, బహుజన ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు డాక్టర్ యాలాద్రి , మాదిగ జేఏసీ ఉపాధ్యక్షులు పాతకోటి కరణ్, బీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు బోరెల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.