Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇంటర్వూ కు అర్హత పొందారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది సివిల్స్ పరీక్ష కు హాజరైన 16 మంది లో ముగ్గురు విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయిన వారిలో వరంగల్ జిల్లా ములుగుకు చెందిన డి. ప్రవీణ్ (హాల్ టికెట్ నెంబర్ 1035114), జనగామకు చెందిన కె. ప్రణరు కుమార్ (హాల్ టికెట్ నెంబర్ 1002593) నిజామాబాద్ కు చెందిన డి. కిరణ్ కుమార్(హాల్ టికెట్ నెంబర్ 1014566) ఉన్నారు. వీరు వచ్చే నెలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కానున్నారు. సివిల్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ఇంటర్వ్యూలో నూ ఉత్తీర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.