Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మారకోపన్యాసంలో టంకశాల అశోక్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ని తరాల పాత్రికేయులకు మార్గదర్శి నార్ల వెంకటేశ్వరరావు అని సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ అన్నారు. సమాజాన్ని కులమతాల పేరుతో విభజించడం భావ్యం కాదనీ, పాత్రికేయులుగా గొప్ప విలువలతో నార్ల జీవించారని చెప్పారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నార్ల జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టంకశాల అశోక్ స్మారకోపన్యాసం చేశారు. నార్ల పట్టుదల, విలువలతో కూడిన పాత్రికేయులుగా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచారని వివరించారు. మంచి జర్నలిస్ట్‌గా గుర్తింపు రావాలంటే సమాజంలో ఉన్న సమస్యలను పారదోలడానికి పనిచేయాల్సిన అవసరముందని సూచించారు. అధ్యక్షత వహించిన విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య కె సీతారామారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో నార్లలాంటి పాత్రికేయులు సమాజానికి చాలా అవస రమన్నారు. విలువలతో కూడిన పాత్రికేయం ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ఆయన రాసిన, సేకరించిన పుస్తకాలను అంబేద్కర్ వర్సిటీ లైబ్రరీకి అందించడం గర్వకారణంగా ఉందన్నారు. వాటిని త్వరలోనే డిజిటలైజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డాఎవిఎన్ రెడ్డి, ప్రొఫెసర్లు ఇ సుధా రాణి, వడ్డాణం శ్రీనివాస్, ఆనంద్ పవార్, గుంటి రవి, ఎల్వీకే రెడ్డి, పరాంకుశం వెంకట రమణ పాల్గొన్నారు.