Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి పదెకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 141ని విడుదల చేసింది. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు స్థాయిలో పెద్ద కోర్టు భవనాన్ని ఏర్పాటు చేసేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామనీ, భూమి పూజ చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ప్రస్తుత కోర్టు కాంప్లెక్స్‌లో సరైన వసతుల్లేక కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని బహిరంగ సభలో సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో మహ బూబ్‌నగర్‌లో అధునాతన కోర్టు భవనాన్ని నిర్మించేందుకుగానూ సీఎం కేసీఆర్ హామీనిచ్చారు. అందులో భాగంగానే బండమీడి పల్లిలోని పశుసంవర్థక శాఖకు చెందిన పదెకరాలను న్యాయ శాఖకు అప్పగిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 141ని విడుదల చేసింది.