Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ...
నవతెలంగాణ-బంజారాహిల్స్
భారతీయ సంస్కృతి, మహిళల సౌందర్యాన్ని రెట్టింపు చేసేవి చీరలేనని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. తనకు చీరంటే ఎంతో ఇష్టమని, ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినపుడు షాపింగ్ చేసి చీరలు కొంటానని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయినిగమాగమంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఇండియా సహకారంతో ఏర్పాటుచేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ వెడ్డింగ్ స్పెషల్ సిల్క్ ఎగ్జిబిషన్‌ను గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం చదువు తున్నప్పుడు చీరలు ధరించానని, అక్కడి ఓ మెడికల్ ఆఫీసర్ చూసి.. ఆరడుగులున్నా ఎటువంటి కుట్టు లేకుండా చీరను బాగా ధరించారని మెచ్చుకున్నా రన్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల చివరివారంలో వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది మర్ముకు ఇక్కడి నుంచే చీరను తీసుకెళ్లి ఇవ్వను న్నట్టు చెప్పారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీ సీఈఓ వినయ్ కుమార్, శ్రీనివాసరావును, అలాగే చేనేతరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5 మంది చేనేత కారులను ఈ సందర్భంగా గవర్నర్ ప్రత్యేకం గా అభినందించారు. కాగా, ఈ ప్రదర్శన ఈనెల 10 వరకూ కొనసాగ నున్నది. కార్యక్రమంలో సోష లైట్ శైలజారెడ్డి, హాండ్లూమ్ క్యురే టర్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.