Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ హాల్లో టీఆర్ఎస్ ఎంపీల నివాళులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పీడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం నేటి సమకాలిన సమాజానికి అత్యంత అవసరమని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన నేతత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ జీవితం నమస్త జనులకు ఆచరణీయమన్నారు. ప్రతి మనిషి ఆత్మ గౌరవంతో జీవించేలా సమన్యాయంతో రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అంబేద్కర్ న్పూర్తితో సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసుకున్నామన్నారు. అంబేద్కర్ చూపిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదని తెలిపారు.