Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు ప్రదర్శన, బహిరంగసభ
- ఆహ్వానసంఘం గౌరవాధ్యక్షులు గుమ్మడి నర్సయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర 22వ మహాసభలు బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో జరగనున్నాయి. మంగళ వారం హైదరాబాద్‌లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ఈ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు న్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సమాజ మార్పు కోసం విద్యార్థులు కృషి చేయాలన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి రాము మాట్లా డుతూ తొలిరోజు (బుధవారం) వీఎస్టీ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు విద్యార్థుల ప్రదర్శన ఉంటుంద న్నారు. అనంతరం బహిరంగ సభను నిర్వహిస్తామని వివరించారు. వక్తలుగా ప్రముఖ విద్యావేత్త జి హర గోపాల్, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్య దర్శి పోటు రంగారావు, నగర కార్యదర్శి ఎం హన్మేశ్, పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎల్ పద్మ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎస్ అనిల్ పాల్గొంటారని చెప్పారు. రెండో రోజు (గురువారం) వీఎస్టీ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ ఉంటుంద న్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. హేతువాద సంఘం జాతీయ కార్యదర్శి నరేంద్ర నాయక్ ప్రారంభోప న్యాసం చేస్తారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరి స్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యా చరణను రూపొందిస్తామన్నారు. పేద లు, దళిత, గిరిజనులు, మహిళలకు విద్య ను దూరం చేయడం కోసమే నూతన విద్యావిధా నాన్ని తెచ్చిందన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి, సహాయ కార్యదర్శి అనిల్, నాయకులు కె ప్రవీణ్‌కుమార్, ఎన్ సుమంత్, రాకేశ్, అనిల్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.