Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వరంగల్
టీఆర్ఎస్కెవి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు కాసు మాధవి తిరిగి సీఐటియూలో చేరారు. ఆమెతో పాటు మరికొందరు బారీగా చేరారు. మంగళవారం సీఐటీయూ వరంగల్ జిల్లా మహాసభ సందర్భంగా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ. రమ, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు సమక్షంలో మాధవికి సీఐటియూ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మిగతా వారికీ సీఐటియూ కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం కాసు మాధవి మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పట్టించుకునేది సీఐటీయూ మాత్రమేనని, సమస్యలు పరిష్కారమ య్యేంత వరకు సీఐటియూ పోరాడుతోందని, అందుకే కార్మికుల పక్షాన పోరాడే సీఐటియూలో తిరిగి చేరుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ అనేక భ్రమలు, ఆశలతో కొందరు సిఐటియును వీడి టిఆర్ఎస్కెవిలో చేరారని, వారి ఆశలు, భ్రమలు తొలగి తిరిగి సీఐటియూలో చేరడం శుభ పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్, ఆల్ యూనివర్సిటీ యూనియన్ నాయకులు మెట్టు రవి, వరంగల్ జిల్లా సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామి, సహాయ కార్యదర్శి అనంతగిరి రవి, సింగారపు బాబు, ఇనుముల శ్రీను, మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.