Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతోష్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వడ్డెరలకు సమస్యలు ఎక్కడుంటే అక్కడ వీఆర్పీఎస్ ఉంటుందని వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి ( వీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షులు, అడ్వకేట్ గుంజి సంతోష్ కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఆ సమితి రాష్ట్ర కార్యాలయాన్ని అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కొమ్మ రాజుల శేఖర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు, గుంజి శ్రీనివాస్, తమ్మిశెట్టి శివ కృష్ణ, గిరిజాపురం రాఘవేంద్ర, పరుశురాం, కుంచాల మారుతి, వడ్డే శాంత్ కుమార్, కిరణ్, ఉప్పుతల శీను, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.