Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ఈ నెల 11న విచారించనుంది. ఆరోజు ఉదయం 11గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలోనే కవితను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నట్లు సీబీఐ ఢిల్లీ కార్యాలయం హెడ్ రాఘవేంద్ర వత్స మంగళవారం కవితకు మెయిల్ ద్వారా సమాచారం పంపారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 6న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ కవితకు నోటీసులు జారీచేసింది. అందుకు ఆమె కూడా సమ్మతి తెలిపారు. అయితే ఆకేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేదనీ, ఈనెల 6న విచారణకు హాజరుకాలేనని కవిత వివరించారు. 11,12,14,15 తేదీల్లో ఏదో ఒక రోజు హైదరాబాద్ రావాలంటూ సీబీఐకి కవిత సమాచారమిచ్చారు. అందుకు స్పందించిన సిబిఐ ఈనెల 11న ఉదయం 11గంటలకు హైదరాబాద్లోని నివాసంలో అందుబాటులో ఉండాలని కవితను కోరింది.