Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే విశ్రాంత ఉద్యోగుల కోసం ఈనెల 15న పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు నాందేడ్ జోన్లలోని వర్క్‌షాప్‌లు, ఇతర యూనిట్లలో వేర్వే రుగా ఈ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో విశ్రాంత రైల్వే ఉద్యో గుల అభ్యర్థనలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్ www.scr.indianrailways.gov.in లో ఉన్నా యనీ, పెన్షనర్లు నిర్దేశించిన నమూనాలో తమ ఫిర్యాదులను వెబ్సైట్ ద్వారా పంపవచ్చని వివరించారు.