Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాలు
- హాజరువుతున్న 4.50 లక్షల మంది అభ్యర్థులు
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు గురువారం నుంచి మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాలలో మొత్తం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు కలిపి 4.50 లక్షల మంది అభ్యర్థులకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధం చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ నుంచి ఎంట్రీకార్డులను తమ పాస్‌వర్డ్‌ల ద్వారా డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండాలని ఇప్పటికే బోర్డు అభ్యర్థులను కోరింది. కాగా, ఉదయం ఆరు గంటలకే వెబ్సైట్లో పాస్‌వర్డ్‌ల ఆధారంగా నిర్ణయించబడిన అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాల వద్ద అడ్మిషన్ కార్డులతో సిద్ధంగా ఉండాలని బోర్డు అధికారులు కోరారు. కాగా, దేహదారుఢ్య పరీక్షలో భాగంగా మొదట పురుష అభ్యర్థులు 1600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనాలి. ఇందులో నెగ్గిన అభ్యర్థులను ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు నిర్ణయించటం ఉంటుంది. ఇందులో నెగ్గిన అభ్యర్థులకు లాంగ్ జంప్, షార్ట్‌పుట్ పరీక్షలను నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హులవుతారు. కాగా, ఈ దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ జనవరి 3వ తేదీ వరకు ముగుస్తుందని బోర్డు చైర్మెన్ వి.వి శ్రీనివాస్‌రావు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలో పాల్గొనే అభ్యర్థులు కచ్చితంగా బోర్డు విధించిన నిబంధనలను పాటించాలని ఆయన స్పష్టం చేశారు.