Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్కు రామేశ్వర్రావు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంత్రి కేటీఆర్ ప్రకటించిన మరో పదివేల ఉద్యోగుల క్రమబద్ధీకరణ జాబితాలో విశ్వవిద్యాలయ కాంట్రాక్టు అధ్యాపకులను కూడా చేర్చాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్ల జేఏసీ చైర్మెన్ డాక్టర్ ఎం రామేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోద్ కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్కు వారు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసి విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను మాత్రమే క్రమబద్ధీకరించకపోవడం సరైంది కాదని తెలిపారు.