Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వంశీరామ్ బిల్డర్స్పై ఆదాయపు పన్ను శాఖాధికారుల సోదాలు బుధవారం రెండో రోజు కూడా కొనసాగాయి. మంగళవారం వీరి సోదాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా, రెండో రోజు ఈ సంస్థ చైర్మెన్ సుబ్బారెడ్డి నివాసంతో పాటు, జూబ్లిహిల్స్‌లోని వారి కార్పొరేటు కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు క్షుణ్ణంగా సాగాయి. వంశీరామ్ సంస్థ బిల్డర్స్ తెలంగాణ, ఆంధ్ర లలో సాగించిన పలు నిర్మాణాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖకు లెక్కలు చూపించటంలో భారీ మొత్తంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఐటీ అధికారుల సోదాల్లో వెల్లడైనట్టు తెలిసింది. దీనిపై ఏ మేరకు అవకతవకలు చోటు చేసుకున్నాయనే విషయమై ఐటీ అధికారులు ఒక ప్రకటనను విడుదల చేసే అవకాశమున్నది.