Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు విడుదల కానున్న రామచంద్ర భారతి, నందకుమార్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మూడో నిందితుడైన సింహయాజిస్వామి బుధవారం చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కాగా, ఒకటి, మూడో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్స్వామి, నందకుమార్లు గురువారం బెయిల్పై విడుదల కానున్నారు. వీరిద్దరికి సంబంధించిన బెయిల్ పత్రాలు బుధవారమే జైలు అధికారులకు అందినప్పటికీ అప్పటికే కాలాతీతం కావటంతో వారి విడుదల మరుసటి రోజుకు వాయిదా పడింది. కాగా, సింహయాజిస్వామి ఉదయం ఏడు గంటల లోపలే జైలు నుంచి విడుదలై మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయారు.