Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం
- వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర నిధుల విడుదల విషయంలో వివక్ష చూపుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గడచిని తొమ్మిది నెలల్లో ఒక్క గుజరాత్ రాష్ట్రానికే 9 నెలల్లో రూ. ఒక లక్షా 37 వేల 655 కోట్ల విలువైన ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇతర పనుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఆ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో ఉంచుకొని ప్రధాని మోడీ నిధుల వరదను పారించారని విమర్శించారు. 40 సార్లు ఆ రాష్ట్రంలో పర్యటించి, ి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని వివరించారు. ఇదే తరహా నిధుల కేటాయింపు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి హౌదాలో దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యతను మోడీ విస్మరిస్తున్నారనీ, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.