Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో కనీసం ఒక్క ఏరియానైనా ఈ-ఆఫీస్‌గా మార్చాలి
- అధికారులకు సంస్థ డైరెక్టర్ల ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశ వ్యాప్త బొగ్గు పరిశ్రమల్లో టెక్నాలజీని సమర్థంగా వినియోగిం చుకుంటున్నామనీ, దానిలో భాగంగా సింగరేణిని కాగితం రహిత కంపెనీగా రూపుదిద్దాలని ఆ సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా కనీసం ఒక ఏరియాను ఈ - ఆఫీస్‌గా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. యాత్రా స్థలాల్లో ఆన్లైన్ వసతి బుకింగ్‌కు సంబంధించి బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ పారదర్శకంగా ఉండి ప్రతీ ఉద్యోగికి సెల్ఫోన్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ఐటీ విభాగంలో కోలిండియాకు ఆదర్శంగా ఉన్నదనీ, దాదాపు పదేండ్ల క్రితమే సంస్థలో ఈఆర్పీని ప్రారంభించినట్టు తెలిపారు. అదే సాంకేతికతను ఇప్పుడు కోలిండియా అమలు చేస్తున్నదని ఉదహరించారు. సింగరేణి సేవా సమితి, సింగరేణి పబ్లిక్ రిలేషన్స్ శాఖలకు ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించిన ఐటీ విభాగాన్ని జనరల్ మేనేజర్(కో ఆర్డినేషన్) ఎమ్ సురేశ్ అభినందించారు. కార్యక్రమంలో జీఎం(ఐటీ) రామ్‌కుమార్, జీఎం(సీపీపీ) సీహెచ్ నర్సింహారావు, జీఎం(ఎస్టేట్) రవి ప్రసాద్, ఎస్వో టూ డైరెక్టర్ సుధాకర్, డీజీఎం(ఐటీ) హరి ప్రసాద్, డిప్యూటీ మేనేజర్(ఐటీ) షర్మిలా మోజెస్ తదితరులు పాల్గొన్నారు.