Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజ్వీకి హెచ్ఆర్డీఏ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు జారీ చేసిన నోటిఫికేషన్లో విస్మరించిన డిపార్ట్మెంట్లను వెంటనే చేర్చాలని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ బుధ వారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎం హెచ్ఎస్ఆర్బీ) చైర్మెన్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీకి లేఖ రాశారు. 1,194 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థి క శాఖ అనుమతించిన నేపథ్యంలో డీఎంఈ విడుదల చేసి న నోటిఫికేషన్లో ఫార్మకాలజీ, క్లినికల్ ఫార్మకాలజీ, నియో నాటాలజీ, పెయిన్ అండ్ పాలియేటివ్, సర్జికల్ ఆంకాల జీ, గైనిక్ ఆంకాలజీ విభాగాలను విస్మరించారని తెలిపారు. ఆర్థికశాఖ అనుమతి మేరకు వాటిని చేర్చాలని కోరారు.