Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గుగనుల్ని వేలం వేస్తున్నారు :టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణిని ప్రైవేటీకరించమంటూ రామగుండంలో చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు ఆ సంస్థకు చెందిన బొగ్గుబ్లాకుల్ని వేలం వేస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్రంపై మండిపడ్డారు. బుధవారంనాడాయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తక్షణం సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిలిపేయాలని కోరారు. కోల్ బ్లాకులు లేకుండా సింగరేణి ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరించవద్దని గతంలో సీఎం కేసీఆర్ ప్రధానికి పలుమార్లు లేఖలు రాశారనీ, ప్రధాని కూడా రామగుండం వచ్చినప్పుడు ప్రైవేటీకరించ బోమని చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బుధవారం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకు సింగరేణి నాలుగు బ్లాకులను ప్రైవేటీకరిస్తున్నామని సమాధానం ఇచ్చారని చెప్పారు. ఇది అన్యాయమని అన్నారు. దేశ వ్యాప్తంగా 38 బ్లాకులను అమ్ముతున్నట్లు కేంద్రం చెబుతున్నదన్నారు. తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపు అనీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటూ, గనులు కూడా లేకుండా అమ్మకానికి పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్రానికి చేసిన అన్యాయాలు, నిధుల నిలిపివేత, విభజన హామీల అమలులో వైఫల్యం, దివాలాకోరు రాజకీయాలు తదితర అంశాలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.