Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాల్పోస్టర్ ఆవిష్కరించిన నాయకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 9,10 తేదీల్లో తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మూడో మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ తెలిపారు. 9న బహిరంగ సభ ఉంటుందనీ, దాన్ని జయప్రదం చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, ఉపాధ్యక్షులు ఆర్.కోటంరాజు, రాష్ట్ర నాయకులు ప్రసాద్, సోమన్న, శ్రీకాంత్, సునిత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ..తమ యూనియన్ రాష్ట్ర మహాసభలు కామారెడ్డిలోని మల్లుస్వరాజ్యం నగర్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. మహాసభకు ముఖ్య వక్తలుగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వక్తలుగా తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, సీఐటీయూ కామారెడ్డి జిల్లా కార్యదర్శి కె.చంద్రశేఖర్ పాల్గొంటారని తెలిపారు.