Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెరుగైన సమాజం కోసం విద్యార్థులు ప్రశ్నిం చాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ లో పీడీఎస్‌యూ 22వ మహాసభల సందర్భంగా ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహిం చిన బహిరంగసభలో హరగోపాల్ మాట్లాడుతూ ప్రశ్నించేందుకు జ్ఞానం అవసరమనీ, ఆ జ్ఞానం విద్య ద్వారా లభిస్తుందని తెలిపారు. ప్రజలు ప్రశ్నిం చడం ఇష్టం లేని ప్రభుత్వాలు విద్యకు బడ్జెట్ తగ్గిస్తున్నా యని విమర్శించారు. దేశ సంపద కొంత మంది వద్ద కేంద్రీకృతం కావద్దనీ రాజ్యాంగం చెబుతుంటే అందుకు విరుద్ధంగా కొంత మంది ధనవంతుల య్యేలా ఆ ప్రభుత్వాల విధానాలుంటున్నా యని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య నందిస్తామని అధికారంలోకి వచ్చిన పాలకవర్గాలు ఎనిమిదేండ్లుగా విద్యావ్యవస్థను ధ్వంసం చేశాయని చెప్పారు. పేద దళిత, గిరిజన వర్గాలకు విద్యను దూరం చేస్తూ సంపన్న వర్గాలు మాత్రమే డబ్బిచ్చి కొనేలా కార్పొరేట్, ప్రయివేటు విద్యను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యలో కాషాయీ కరణ, అశాస్త్రీయ భావజాలాన్ని జొప్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యాంశా ల్లో అశాస్త్రీయ అంశాలు పెడుతున్నారని తెలిపారు. ప్రశ్నించడమే నిజమైన విద్య అని స్పష్టం చేశారు. సీపీఐ(ఎంఎల్) ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకటేననీ, ప్రజల ఆకాంక్షలను పట్టించు కోవడం లేదని విమర్శించారు. సిట్ వర్సెస్ ఈడీగా టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతు న్నాయనీ, చివరకు ఇద్దరు రాజీ పడతారని ఆరోపించారు. గుజరాత్ మోడల్ అంటే పాఠశాలల్లో మరుగుదొడ్లు, టీచర్లు లేక పోవడమని విమర్శించారు. పోరాడి తెచ్చు కున్న తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో నిర్బంధ తెలంగాణగా మార్చారనీ, ప్రజా స్వామిక తెలంగాణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మహాసభ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ సమసమాజం కోసం జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌ల స్ఫూర్తిగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. వ్యవస్థ మార్పు కోసం అన్ని పోరాటాల్లో పాల్గొనా లని సూచించారు. శాస్త్రీయ విద్య నేటి సమాజానికి అవసరమని చెప్పారు. పీడీ ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయి నపల్లి రాము మాట్లా డుతూ ఆత్మహత్యలు, ఆకలిచావులు, నిరుద్యోగం లేని సమాజం కోసం విద్యార్థులు కదిలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ మహాసభలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.ఎల్.పద్మ, సీపీఐ (ఎంఎల్) ప్రజా పంథా నగర కార్యదర్శి ఎం.హన్మేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్య క్షులు స్వాతి, పృథ్వి, భాస్కర్, ఎస్.అనిల్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆజాద్, గణేష్, నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. సుమంత్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మనోహర్ రాజ్ పాల్గొన్నారు.