Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో ముందుకు : ఎంపీ సంతోష్‌కుమార్
- పుట్టినరోజు సందర్భంగా ఫారెస్ట్ కాలేజీలో మొక్కలు నాటిన ఎంపీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హరిత భారత్, హరిత తెలంగాణ సాధనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వప్నమని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ప్రేరణ పొందుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థుల మధ్య మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. బీడుగా ఉన్న రాష్ట్రాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత హరితమయంగా మార్చాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని తీసుకున్నారనీ, దాని నుంచే స్ఫూర్తి పొంది తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. విదేశాల్లోని తెలుగు వారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటడం గొప్ప విషయమని చెప్పారు. వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ తీసుకురావడంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయం సాధించిందన్నారు. దేశవ్యాప్తంగా ఆకుపచ్చని ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు. తమ ఉద్యమంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఫారెస్ట్ కాలేజ్ డీన్ ప్రియాంక వర్గీస్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ, పాల్గొన్నారు.