Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
- అత్యధిక విరాళాలు సేకరించిన హైదరాబాద్ జిల్లాకు ట్రోఫీ అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైనికుల సేవలు వెల కట్టలేనివని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కొనియాడారు. సాయుధ దళాల పతాక దిన్సోతవం-2022 సందర్భంగా ఈ ఏడాది సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి హైదరాబాద్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి అత్యధికంగా విరాళాలు సేకరించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఈ మేరకు బుధవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై హైదరాబాద్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి, వారి సిబ్బందిని అభినందించి వారికి రోలింగ్ ట్రోఫీని బహుకరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. సైనికుల కోసం నిధులు సేకరించడం చాలా సంతోషమని తెలిపారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అత్యధికంగా విరాళాలు సేకరించడం అభినందనీయమని, సైనికుల కుటుంబాలకు ఈ నిధిని సక్రమంగా అందేలా చూస్తానని చెప్పారు. అనంతరం హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుని శ్రీనేష్ కుమార్ వారి సిబ్బంది, ఎన్సీసీ కేడట్స్తో కలిసి స్టిక్కర్ను అందించి ఆయన నుంచి విరాళాలను సేకరించారు.