Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌లో 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన వారిని సొంత జిల్లాకు తెచ్చేందుకు అవకాశం కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి, ఎమ్మెల్సీ కె జనార్ధన్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జియోట్యాగింగ్ హాజరు విధానాన్ని తొలగించాలని కోరారు. ఈనెల పదో తేదీన జరిగే మంత్రివర్గంలో ఉపాధ్యాయుల పదోన్నతులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాలని సూచించారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.