Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గువేలంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
- ప్రయివేటీకరించబోమంటూ ప్రధాని మోడీ కల్లబొల్లి మాటలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రయివేటీకరించబోమం టూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తెలంగాణ పర్యటనలో కల్లబొల్లి మాటలు చెప్పారంటూ విమర్శి ంచారు. నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నట్టు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణిని ప్రయివేటీకరించడమంటే తెలంగాణను కుప్పకూల్చ డమేనని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై అసూయ తోనే, ఇక్కడి విజయ ప్రస్థానాన్ని దెబ్బ కొట్టాలన్న కుట్రతోనే సింగరేణి ప్రయివేటీకరణకు కేంద్రం పూనుకుందని విమర్శించారు. రాష్ట్రంతోపాటు దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణిదే కీలక పాత్ర అని గుర్తు చేశారు. గనులు కేటాయించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను దివాలా తీయించిన విధంగానే సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తున్నదని తెలిపారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పీఎల్ఎఫ్లోనూ రికార్డు సృష్టిస్తున్న సింగరేణిని ప్రయివేటీకరించాల్సిన అవసరమేముందని కేంద్రాన్ని ప్రశ్నించారు. సింగ రేణికి బొగ్గు గనులు కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు మాత్రం గనులు కేటాయించుకున్నారని గుర్తు చేశారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించిన గనులకు సంబంధించిన పత్రాలను కేటీఆర్ విడుదల చేశారు. గుజరాత్‌కు ఒకనీతి, తెలంగాణ మరొక నీతిని అమలు చేస్తున్నారా?అనే విషయాన్ని ప్రధాని మోడీ స్పష్టతనివ్వాలని కోరారు. తెలంగాణ పట్ల పక్షపాతం ఇంకెన్ని రోజులంటూ ప్రశ్నించారు. ఇది ఒక్క సింగరేణి కార్మికుల సమస్య కాదనీ, సమస్త తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సామాజిక జీవనాడి సింగరేణి అని పేర్కొన్నారు. సింగరేణి ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సింగరేణి ప్రయివేటీకరణ కుట్రలపై పార్టీలకతీతంగా రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలని కోరారు.