Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విద్యుత్ స్కూటర్ల తయారీదారు క్వాంటమ్ ఎనర్జీ రాష్ట్రంలో తన తొలి డీలర్‌షిప్‌ను హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తెరిచింది. గురువారం ఈ నూతన డీలర్‌షిప్‌ను క్వాంటమ్ ఎనర్జీ ఉన్నతాధికారుల సమక్షంలో తెలంగాణా రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ షోరూంలో మూడు ఇవి స్కూటర్లను అందుబాటులో ఉంచింది. త్వరలోనే సికింద్రాబాద్, వరంగల్‌లో నూతన షోరూంలను తెరువనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సాలో విక్రయాలను కలిగి ఉన్నట్లు వెల్లడించింది.