Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్య రుసుం రూ.100తో అవకాశం
- ఇంటర్ బోర్డు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2023, మార్చిలో జరిగే వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు చెల్లింపు గడువును ఆలస్య రుసుం రూ.100తో ఈనెల 12వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆలస్య రుసుం రూ.100తో ఫీజు చెల్లింపు గడువు ఈనెల ఆరో తేదీన ముగిసిన విషయం తెలిసిందే.
టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్ నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలంటూ కోరిన విషయం విదితమే. దీంతో ఆమె స్పందించి ఫీజు గడువును పెంచాలంటూ ఇంటర్ బోర్డు అధికారులను ఆదేశించారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఫీజు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర వివరాలకు tsbie.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు.