Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్ కుమార్
- ప్రభుత్వ పాలసీపై జార్ఖండ్ అధికారులు ఆసక్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జార్ఖండ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు ఆరాధనా పట్నాయక్, సంతోష్ కుమార్ వత్స నేతృత్వంలోని అధికారుల బృందం గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో సమావేశమైంది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా అమలు చేయబడిన ఉత్తమ విధానాలను సీఎస్ వారికి వివరించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మార్గదర్శకత్వంలో పరిపాలనలో మార్పు జరిగిందని సీఎస్ పేర్కొన్నారు. కంప్యూటరైజేషన్పై ఎక్కువ దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. అనేక సర్కిళ్లను జోడించడం ద్వారా విభాగం పునర్వవస్థీకరించ బడిందని, పరిశోధన, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయని సీఎస్ వివరించారు. వాణిజ్య పన్నుల శాఖలో తీసుకొచ్చిన మార్పుల ద్వారా ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ.65 వేల కోట్లకు చేరిందన్నారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా విస్తరించిందన్నారు. రాష్ట్రంలోని ఉత్తమ విధానాల గురించి తెలుసుకోవడం తమకు గొప్ప అనుభవం అని జార్ఖండ్ అధికారులు చెప్పారు. తమ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు కమిషనర్లు సాయి కిషోర్, శ్రీ కాశి పాల్గొన్నారు.