Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15న అభ్యర్థులకు గాంధీ మెడికల్ కాలేజీలో స్క్రీనింగ్ టెస్ట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జపాన్‌లో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ప్రకటించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్డ్, రిక్రూట్మెంట్ ఏజెన్సీ, జపాన్ ప్రభుత్వ పథకం, స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ కింద అక్కడ పనిచేసేందుకు అవకాశమున్నది. బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, జీఎన్ఎం డిప్లొమా పూర్తి చేసిన వారు దీనికోసం దరఖాస్తు చేయొచ్చు. విజయవంతమైన అభ్యర్థులు నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు సంపాదించొచ్చు. అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ ఈనెల 15న గురువారం ఉదయం 11 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తారు. ఈనెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 9100798204/9908830438 లేదా www.tomcom.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.