Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మెన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వనపర్తి జిల్లా కోత్తకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న కొందరు అధ్యాపకులను అన్యాయంగా ఇంటర్ విద్యాశాఖ జేడీ చేసిన బదిలీలను రద్దు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మెన్ రాచాల యుగంధర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ డీడీ లక్ష్మారెడ్డి, జేడీ ఓబిలిరాణిని గురువారం హైదరాద్‌లో కలిశారు. ఆ బదిలీలను రద్దు చేయకుంటే ఇంటర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భరత్, బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర ఇంచార్జీ సంతోష్ రాథోడ్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు విజరుకుమార్‌రెడ్డి, నాయకులు సాయి, రమేష్, నవీన్‌కుమార్, కురుమయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.