Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాచల్‌ప్రదేశ్ ఫలితాలపై భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నదని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు, కాంగ్రెస్ విజయం కొసం కృషి చేసిన క్యాడర్‌కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్ ప్రజలకు, ఓటర్లకు కతజ్ఞతలు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మోడీ చేస్తున్న ఆకృత్యాలు, అరాచకాలను సహించలేని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నప్పటికీ దేశ ప్రధాని, దేశ అధికార యంత్రాంగం గుజరాత్లో మోహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో బీజేపీ విజయం సాధించిందని పేర్కొన్నారు. ఎంఐఎం, ఆప్ లాంటి పార్టీలను బీజేపీ ప్రోత్సహించి లౌకికవాద ఓట్లు చీల్చి గుజరాత్లో గెలిచారని విమర్శించారు. ఆప్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నట్టుగా మీడియాలో బీజేపీలో ప్రచారం చేయించి లబ్ది పొందారని చెప్పారు. ప్రధాని తన స్థాయిని దిగజార్చుకుని ఒక రాష్ట్రంలో 36 సభల్లో ప్రసంగించారని ఎద్దేవా చేశారు. ఓటమికి నూతన కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే బాధ్యులు కాదని చెప్పారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారనీ, ఉప ఎన్నిక ప్రచారానికి రానుందుకు ఆయనకు క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందన్నారు. సమైక్య రాష్ట్రం నినాదంపై సజ్జల రామకష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ బృందానికి నాయకులకు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ గుజరాత్లో భారీ మెజార్టీతో గెలిచినా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారం కోల్పోవడం బీజేపీ, మోడీ, అమిత్‌షాలకు చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ పేర్కొన్నారు.