Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబులు పేల్చే క్రమంలో అపశృతి..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం సంబురాలను నిర్వహించారు. గుజరాత్లో మరోమారు బీజేపీ అధికారంలోకి రావడంతో స్వీట్లు పంచుకున్నారు. కార్యాలయం ఎదుట బాంబులు పేల్చుతుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి పక్కనున్న ప్లెక్సీలకు నిప్పంటుకున్నది. క్షణాల వ్యవధిలో మంటలు వ్యాప్తి చెందాయి. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికున్న వైర్లు కాలాయి. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. అక్కడున్నవారు వెంటనే ఫైరింజన్‌కు ఫోన్‌చేశారు. బకెట్లతో నీళ్లు చల్లుతూ మంటలను ఆర్పేందుకు యత్నించారు. ఆలోగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.