Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ (ఎల్ఎల్ఎఫ్ ) తెలంగాణా ఏరోస్పేస్ విభాగంలో వికలాంగులకు తొలి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ముగించింది. తెలంగాణాలో ఏరోస్పేస్ ఉత్పాదనా రంగంలో అంగవైకల్యానికి గురైన వారికేనంటూ ప్రత్యేకంగా తొలి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం '' స్కిల్ ఇండియా పథకం'' తో నైపుణ్యాభివృద్ధి పథకానికి అనుగుణంగా బోయింగ్, టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ తో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నాయి. తొలి విడతలో మాట, వినికిడి ఇతర సమస్యలు కలిగిన 17 మంది అభ్యర్థులు తరగతి గది శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా 'ఆన్-ది జాబ్' శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో టీబీఏఎల్ అధికారులు బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్ మైఖేల్ ఆర్థర్, బోయింగ్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ బ్రెండన్ నెల్సన్, బోయింగ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ స్కాట్ డ్రాక్, బోయింగ్ ఇండియా డైరెక్టర్ హెచ్ఆర్ అజరు శర్మ, బోయింగ్ ఇంటర్నేషనల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లారా లెగ్రా, బోయింగ్ ఇండియా సౌత్ ఏసియా స్టాఫ్, బీజీఇ లీడ్ ప్రవీణ్ యజ్ఞం భట్, బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తా, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మేనేజింగ్ పార్టనర్ నూరియా అన్సారి తదితరులు పాల్గొన్నారు.