Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- టీఎస్పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ పరిధిలోని 18 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 16 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు వచ్చేనెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువుందని వివరించారు. మల్టీజోన్-1 పరిధిలో ఐదు, మల్టీజోన్-2లో 13 కలిపి మొత్తం 18 పోస్టులున్నాయని పేర్కొన్నారు. ఫార్మసీ, ఫార్మాసూటికల్ సైన్స్, ఫార్మాడీలో డిగ్రీ ఉత్తీర్ణత కావాలనీ, లేదంటే క్లినికల్ ఫార్మాకాలజీ, భారత్లో స్థాపించిన విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీ చదివి ఉండాలని సూచించారు. మే లేదా జూన్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.