Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ జిల్లా ఆసిఫ్‌నగర్ సెయింట్ ఆన్స్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థినీ రఫియా కలీం కనుగొన్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఆవిష్కరణ రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈ మేరకు గురువారం ఆ పాఠశాలకు ప్రిన్సిపాల్ సిస్టర్ పుష్పామేరీ వివరాలను వెల్లడించారు.
రఫియా కలీంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇటీవల కాలంలో వస్తున్న వాతావరణ మార్పులకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు చవక ధర పరికరాన్ని తమ విద్యార్థిని కనుగొన్నట్టు వెల్లడించారు. ఈ పరికరం కేవలం రూ.10 నుంచి 15 వేల వరకు మాత్రమే ఖర్చవుతుందని తెలిపారు. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకునే వీలుంటుందని చెప్పారు. హైదరాబాద్ జిల్లా నుంచి 10 ఆవిష్కరణలు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా అందులో ఒకటి తమది కావడంపట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలోనూ తమ ప్రదర్శనలో తమ ఆవిష్కరణ జాతీయ స్థాయికి ఎంపికవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.