Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కె రాజిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకిచ్చిన హామీలను నెరవేర్చాలని మునుగోడు నియోజక వర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య చైర్మెన్ కె రాజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర క్యాబినెట్ లో ఆర్టీసీ కార్మికులకిచ్చిన హామీలను అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంతోపాటు మంత్రులు హారీష్‌రావు, పువ్వాడ అజరు కుమార్, జి జగదీశ్వర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మెన్‌కు వినతి పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య ఆద్వర్యంలో మునుగోడు నియోజకవర్గం నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకు మౌనప్రదర్శనతో కూడిన పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు.